ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన పవిత్ర, నరేష్ (వీడియో)

by Disha Web Desk 6 |
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన పవిత్ర, నరేష్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర గత కొద్దికాలంగా సహజీవనం చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, శుక్రవారం మైసూర్‌లో పవిత్ర, నరేష్ సాంప్రదాయబద్దంగా ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సమక్షంలో ఏడడుగులు వేశారు. పెళ్లికి సంబంధించిన వీడియోను స్వయంగా నరేష్ మీడియాకు విడుదల చేయడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనస్సులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్ర నరేష్’’ అంటూ ట్విట్టర్‌లో వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే పవిత్రకు వివాహం జరగగా.. విడాకులు తీసుకుని నరేష్‌తో కలిసి ఉంటోంది. నరేష్‌కు భార్య రమ్య రఘుపతితో పాటు ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. కాగా, గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు నెలకొనడంతో పాటు నరేష్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాడు.

Also read: మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా.. తెలిస్తే షాకే!

Next Story

Most Viewed