ఇదొక కొత్త రకమైన కథ.. బ్లాక్‌బస్టర్‌ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ‘పతంగ్‌’ లో ఉన్నాయి: దేవకట్టా

by Mallepaka Hamsa |

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’(pathang).

ఇదొక కొత్త రకమైన కథ.. బ్లాక్‌బస్టర్‌ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ‘పతంగ్‌’ లో ఉన్నాయి: దేవకట్టా
X

దిశ, సినిమా: ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’(pathang). ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామాను సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌(Preeti Pagadala), జీ స‌రిగ‌మ‌ప ర‌న్నర‌ప్ ప్రణ‌వ్ కౌశిక్‌(Pranav Kaushik)తో పాటు వంశీ పూజిత్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్నారు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్రముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్రల్లో క‌నిపించ‌బోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Wlo;Shngay..తాజాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవకట్టా మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ ఎంతో ఎనర్జిటిక్‌, ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. రమ్య ఈ సినిమాకు వన్‌ ఆఫ్‌ ద ప్రొడ్యూసర్‌ అవ్వడం హ్యపీగా ఉంది. ఇదొక కొత్త రకమైన కథ. ఈ సినిమాను చాలా కష్టపడి తీశారు. ట్రైలర్‌ చూడగానే సూపర్‌ థ్రిల్ల్‌గా ఫీలయ్యాను. ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు. కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. ‘పతంగ్’ తప్పకుండా థియేటర్‌లో ఆడియన్స్‌ అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా అందరికీ కొత్త అనుభూతినిస్తుంది. రియలిస్టిక్‌ సినిమాటిక్‌ ఫీల్‌ను కలిగిస్తుంది’’ అన్నారు.

Next Story