- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Mega Couples: పారిస్ ఒలంపిక్స్.. పారిస్ వీధుల్లో సందడి చేస్తున్న మెగా కపుల్స్.. (పోస్ట్)
దిశ, సినిమా: గ్రాండ్‌గా నిన్న పారిస్‌లో 2024 ఒలంపిక్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఈ ఒలంపిక్స్‌లో పోటీ చేయడానికి పారిస్ వెళ్లారు. పలు దేశాల ప్రముఖులు కూడా పారిస్ ఒలంపిక్స్‌ని చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇక మన మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లీన్ కారా కూడా వెకేషన్‌కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఇటీవల ప్రకటించారు. అయితే ప్రస్తుతం పారిస్ వీధుల్లో ఈ మెగా కపుల్స్ సందడి చేస్తున్నారు. పారిస్ ఒలంపిక్స్ వేడుకలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా కపుల్స్ వెకేషన్ నుంచి ఓ ఫోటో రాగా తాజాగా ఉపాసన పారిస్ వీధుల్లో తిరుగుతున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్‌లో భాగంగా.. చిరంజీవి, సురేఖ పారిస్ వీధుల్లో నడుస్తుండగా ఉపాసన వెనుక నుంచి వీడియో తీసింది. తర్వాత అలా వారు నడుస్తూ సడెన్‌గా వెనక్కి తిరిగి చూసేసరికి తమ కోడలు వీడియో తీస్తున్నది తెలుసుకున్న చిరంజీవి, సురేఖ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చారు. అలాగే రామ్ చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటో.. అక్కడ పారిస్ వీధుల్లో ఒలంపిక్స్ హంగామాలో ఉపాసన సందడి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో పారిస్‌లో ఈ మెగా కపుల్స్ చేసే హంగామా వైరల్‌గా మారింది.
Read more...
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవి ఎత్తుకుని ముద్దాడుతోన్న ఈ బుడ్డోళ్లు ఎవరో గుర్తుపట్టండి..!