మొదలైన పరిణీతి-రాఘవ్‌ల పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ పిక్స్ వైరల్

by Disha Web Desk 23 |
మొదలైన పరిణీతి-రాఘవ్‌ల పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా ఇంట పెళ్లి సందడి మొదలైంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వీరి వివాహం జరగనుండగా ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వేడుకకు అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరవగా.. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌‌లోని లీలా ప్యాలెస్‌‌లో పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుంది. దీనికి సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని, పెళ్లికి వచ్చే అతిథులు, వీవీఐపీల కోసం ఉదయ్‌ పూర్‌లో విలాసవంతమైన హోటళ్లను బుక్‌ చేసినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఇక హల్దీ, మెహందీ, సంగీత్‌ సహా వివాహాది కార్యక్రమాలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయని, పెళ్లి తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed