వైఫల్యాలే మనల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి.. పరిణీతి

by Disha Web Desk 7 |
వైఫల్యాలే మనల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి.. పరిణీతి
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఇటీవల వరుస వైఫల్యాలను ఎదుర్కోవడంపై ఓపెన్ అయింది. రీసెంట్‌గా 'కోడ్ నేమ్ తిరంగ'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె నటనకు మంచి మార్కులు పడినా.. సినిమా అనుకున్న రేంజ్‌లో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ పరాజయాలను చవిచూడటం కాస్త ఆందోళనగానే ఉందన్న నటి.. వైఫల్యాలే తనను మరింత శక్తివంతంగా తీర్చదిద్దుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.

ఇక ఈ క్లిష్ట సమయంతో కూడిన ప్రయాణం గురించి ఒక పుస్తకాన్ని రాస్తానన్న నటి.. ఇంత తక్కువ సమయంలో తనలాగా ఈ రకమైన హెచ్చు తగ్గులు ఎక్కువమంది ఎదుర్కోలేదని చెప్పింది. 'ఈ పరాజయాలు నిన్ను ప్రభావితం చేస్తున్నాయా? దారుణమైన పరిస్థితిలో ఉన్నావా? అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. కానీ నా కెరీర్‌లో ఈ నాలుగేళ్లు చెడుగా ఉన్నా.. దాని గురించి మాట్లాడినప్పుడు నవ్వుతూనే ఉంటున్నా. ఎందుకంటే నేను మొదలుపెట్టిన స్థాయికి చేరుకున్నా. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశా. కాబట్టి ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా. ఏ రకమైన ఆందోళన చెందను' అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి :

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుంచి సెన్సేషనల్ ఫ్యాక్ట్..!

Next Story

Most Viewed