ఎంపీతో స్టార్ హీరోయిన్ పెళ్లి తేదీ ఖరారు.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక

by Disha Web Desk 9 |
ఎంపీతో స్టార్ హీరోయిన్ పెళ్లి తేదీ ఖరారు.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా వీరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల (సెప్టెంబరు) 25న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఆల్రెడీ అతిథుల కోసం లగ్జరీ హూటళ్లలో రూమ్స్‌ బుక్ చేశారని సమాచారం. దగ్గరి సన్నిహితులు, స్నేహితుల కోసం కూడా ప్రత్యేకంగా లంచ్ రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారట. మరోవైపు ఉదయ్‌పూర్‌లో పోలీసులు వీరి పెళ్లికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే తాజాగా పరిణీతి - రాఘవ్‌ చద్దా పెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానం పలుకుతూ.. పోస్టు చేసిన ఇన్విటేషన్‌ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. తెలుపు రంగులో ఉన్న ఇన్విటేషన్ కార్డు చుట్టూ బంగారు వర్ణం డిజైన్ ఉంది. నీలి రంగులో ఉన్న అక్షరాలతో కార్డు మెరిసిపోతుంది.


Next Story

Most Viewed