పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైరల్

by Disha Web Desk 6 |
పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో డేటింగ్‌లో ఉన్నాట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఓ హోటల్‌కు డిన్నర్ డేట్‌కు వచ్చినప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరిణీతి, రాఘవ్ చద్దా నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. శనివారం న్యూఢిల్లీలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. తాజాగా, పరిణీతి ఎంగేజ్‌మెంట్ ఫొటోలను తన ఇన్‌గ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా ‘నేను ప్రార్థించి.. అవునని చెప్పాను’ అంటూ క్యాప్షన్‌ను జత చేసింది. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read more:

Prabhas : భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్!

Next Story

Most Viewed