ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన పరిణీతి చోప్రా.. షాకింగ్ పోస్ట్ వైరల్!

by Disha Web Desk 6 |
ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన పరిణీతి చోప్రా.. షాకింగ్ పోస్ట్ వైరల్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే పరిణీతి, ఆప్ లీడర్ రాఘవ చద్దాను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఇక వీరిద్దరు హానీమూన్‌కు కూడా వెళ్లి వచ్చారు. అంతేకాకుండా పరిణీతి సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది.

ఈ క్రమంలో పరిణీతి ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ టీషర్ట్ ధరించి కనిపించడంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా, ఈ అమ్మడు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ కఫ్‌టాన్ డ్రెస్, పెద్ద సైజు దుస్తులు, ఇండియన్ కుర్తాలు ఏవి వేసుకున్నా ప్రెగ్నెన్సీ అయినట్లేనా’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ స్మైలీ ఎమోజీను కూడా షేర్ చేసింది. తాను వేసుకునే మూడు రకాల బట్టల వల్ల అలా అనుకోవడం ఫన్నీగా ఉందని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం పరిణీతి పోస్ట్ వైరల్ అవుతుండటంతో ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పడినట్లు అయింది.




Next Story

Most Viewed