‘పరేషాన్‌’ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ ఎంత రాబట్టిందో తెలుసా?

by Disha Web Desk 6 |
‘పరేషాన్‌’ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ ఎంత రాబట్టిందో తెలుసా?
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంతో చిన్న బడ్జెట్‌తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను బాగా అకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా అలాంటి కోవకు చెందినా సినిమా ‘పరేషాన్‌’. టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరాం, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్ లాంటి నూతన నటులు నటించిన ఈ మూవీ పూర్తిగా తెలంగాణ నేటివిటి, భాష, యాసతో తెరకెక్కింది. రానా దగ్గుబాటి సమర్పించడంతో చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి మంచి టాక్ సొంతం చేసుకోగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రూ.23 లక్షలు. రెండో రోజు రూ.32 లక్షలు. మూడోరోజు రూ.40 లక్షలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఆదివారం నుంచి 70ఎమ్ఎమ్ స్క్రీన్ పెంచారు. దీంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: యాంకర్ సుమ పని అయిపోయినట్లేనా?

Next Story

Most Viewed