- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పరమ్ సుందరి’ విడుదల వాయిదా.. డబుల్ అప్డేట్స్ ఇస్తూ మెస్మరైజింగ్ పోస్టర్ షేర్ చేసిన మూవీ మేకర్స్
బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra), జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra), జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’(Param Sundari). ఈ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్ప్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇందులోంచి ఈ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. ఈక్రమంలోనే.. మూవీ మేకర్స్ ‘పరమ్ సుందరి’ జులై 25న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.
కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తాజాగా, ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇస్తూ డబుల్ అప్డేట్స్‌ను షేర్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించడంతో పాటు ఇందులోంచి పరదేసియా అనే సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ భార్యభర్తలుగా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో జాన్వీ స్టిల్ అదిరిపోయింది. ఇక అది చూసిన నెటిజన్లు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.






