Pan India Movies: పండగే పండుగ.. ఒకే రోజు రెండు భారీ సినిమాల నుంచి అప్డేట్?

by Disha Web Desk 10 |
Pan India Movies: పండగే  పండుగ.. ఒకే రోజు  రెండు భారీ సినిమాల నుంచి  అప్డేట్?
X

దిశ, వెబ్ డిస్క్: రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయా ? అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గానే హీరోయిన్ రష్మిక షూటింగ్లో జాయిన్ అయ్యింది. ఈ సినిమా first glimpse కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సుకుమార్ చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇక తగ్గేదే లే అనుకుంటూ.. ఈ సారి పుష్ప ది రూల్ అప్డేట్ పై క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా glimpse ను విడుదల చెయ్యడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే మార్చి 8 న పుష్ప 2 నుంచి బిగ్ అప్డేట్ రానుందని సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

అదే రోజున ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ నుంచి కూడా కొత్త అప్డేట్ రాబోతుందట.ఆది పురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఏప్రిల్ 8 న హోలీ పండుగ కాబట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. మార్చి 22 న ఉగాది పండుగ సంధర్భంగా అప్డేట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆది పురుష్ సినిమా జూన్ 16 న రీలీజ్ అవుతుండగా పుష్ప 2 సినిమా ఈ ఏడాది చివర్లో కానీ, 2024 సమ్మర్లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Natural Star Nani: "తగ్గేదే లే" అంటున్న నేచురల్ స్టార్ నాని

Next Story

Most Viewed