- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌కు భారతదేశ సమస్యలు కనిపించట్లేదు: Pallavi Joshi
దిశ, సినిమా: ప్రముఖ నటి, 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత పల్లవి జోషి బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్న ఆమె..Latest Telugu News

దిశ, సినిమా: ప్రముఖ నటి, 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత పల్లవి జోషి బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్న ఆమె.. తాజాగా హిందీ సినిమాల్లో కంటెంట్ లేదంటూ బాంబ్ పేల్చింది. సరుకు లేని కథలతో ముందుకొస్తున్న మేకర్స్ ఖాళీ డబ్బాల చప్పుడుతో ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. అలాగే తమ చిత్రంలో పెద్ద స్టార్లు లేరని ఎంతమంది ఎద్దేవా చేసినా.. ఈ ఏడాది అతి పెద్ద హిట్‌గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించిందని పేర్కొంది.
ఇక పెద్ద సినిమాలు అట్టర్ ప్లాఫ్ అయిన చోట కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన తమ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 341 కోట్ల గ్రాస్ వసూలు చేసి గోల్డెన్ మూవీగా నిలిచిందని చెప్పుకొచ్చింది. చివరగా భారతదేశ సమస్యలు చూపించని సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తే 'బాలీవుడ్‌ను బహిష్కరించండి' అంటూ త్వరలోనే నినదిస్తారని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Also Read : బాలీవుడ్ హీరోలకు బౌన్సర్‌గా పనిచేయాలనుంది: తమన్నా
Also Read : మహిళా దర్శకులతో సినిమా.. గొప్ప అనుభూతి పొందుతామన్న Nawazuddin Siddiqui
- Tags
- Pallavi Joshi






