నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. సెట్‌లోనే గుండె పగిలేలా ఏడ్చిన నటి

by Disha Web Desk 10 |
నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. సెట్‌లోనే గుండె పగిలేలా ఏడ్చిన నటి
X

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటుడు అవినాష్‌ సచ్‌దేవ్‌పై నటి పాలక్ పురస్వాని సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ ఓటీటీ2లో కంటెస్టెంట్‌గా ఉన్న పాలక్.. ఓ టాస్క్‌లో భాగంగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న బిగ్గెస్ట్ స్ట్రగుల్ గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు నటుడు అవినాష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణంగా మోసం చేశాడని, ఆ సంఘటన తర్వాత తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పింది. ‘అవినాష్ చేతిలో మోసపోయినట్లు ‘దుర్గా మాతా కి ఛాయా’ సెట్స్‌లో తెలుసుకున్నా. దీంతో నా హృదయం ముక్కలైంది. గుండె పగిలేలా ఏడ్చాను. చాలారోజులు డిప్రెషన్‌లో ఉన్నాను. నన్ను అలా చూడలేక ఫ్రెండ్స్ బాధపడేవారు. చివరికి సహనటి సిమ్రాన్ బుధారుప్ ఆ సమస్యనుంచి నన్ను బయటపడేసింది’ అని గుర్తుచేసుకుంటూ పాలక్ మరోసారి ఎమోషనల్ అయింది.

Read More..

అమితాబ్ ఇంట్లో లింగ వివక్షత.. మనుమరాలి కామెంట్స్ వైరల్

‘మంగళవారం’ సినిమా టీజర్ రిలీజ్.. బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన పాయల్

Next Story

Most Viewed