ఓవర్ నైట్ సెలబ్రిటీ.. RGV కంట్లో పడిన పిల్లకు బంపర్ ఆఫర్

by Disha Web Desk 7 |
ఓవర్ నైట్ సెలబ్రిటీ.. RGV కంట్లో పడిన పిల్లకు బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఏదో ఒక దానిపై తనదైన స్టైల్లో స్పందిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి ఈయన పెట్టే పోస్టులు సంచలనం సృష్టిస్తుంటాయి. తాజాగా.. ఆర్‌జీవీ ‘కెమెరా మెడలో పెట్టుకుని ఫొటోలు తీస్తున్న అమ్మాయి ’ వీడియో షేర్ చేసి.. ఈ అమ్మాయి ఎవరకైనా తెలుసా అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావంతో ‘పాపం ఆ అమ్మాయిని వదిలేయ్’ అంటూ కొంత మంది రిప్లైలు పెడుతుంటే.. మరికొందరు మాత్రం నిజంగానే ఆ అమ్మాయి ఎవరు అని వెతికే పనిలో పడ్డారు. కానీ, నెటిజన్లు కంటే ముందే ఆ అమ్మాయిని కనిపెట్టేశాడు ఆర్‌‌జీవి. అంతే కాదు సినిమా ఆఫర్ కూడా ఇచ్చేశాడు.

‘‘శారీ మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అని చాలా మంది చెప్పారు. నేను అప్పుడు నమ్మలేదు నిన్ను చూసేవరకు. నిన్ను చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. శారీ మీద ఓ సినిమా చేయాలని ఆశగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా.. ‘‘హే శ్రీ లక్ష్మీ నీకు కనుక నటనలో ఇంట్రెస్ట్ ఉంటే నాకు డీఎమ్ చెయ్’’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆర్‌జీవి కంట పడితే ఎలాంటి అమ్మాయి అయిన సెలబ్రిటీ కావాల్సిందే. అంతెందుకు మన దర్శకుడు చెప్పిన తర్వాత తెలుగు వాళ్లు చాలా మంది ఇప్పుడు ఆమె అకౌంట్ వైపు పరుగులు పెడుతున్నారు. అంతే కాకుండా ‘‘మా రాము మామ చెప్పాడు వచ్చేశా’’ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆర్‌జీవి ఆఫర్‌ను ఆ అమ్మడు ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది.



Next Story

Most Viewed