మా ప్రేమ అప్పటి నుంచే మొదలవుతుంది.. అతడితో ఉన్న ఫొటో షేర్ చేసిన అనన్య పాండే

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

మా ప్రేమ అప్పటి నుంచే మొదలవుతుంది.. అతడితో ఉన్న ఫొటో షేర్ చేసిన అనన్య పాండే
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇటీవల ‘కేసరి చాప్టర్-2’ చిత్రంతో హిట్ అందుకుంది. ప్రస్తుతం అనన్య పాండే ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’ (TuMeriMainTeraMainTeraTuMeri)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్‌(Karthik Aryan)ను జోడీగా నటిస్తోంది. సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనవల్లా నిర్మిస్తున్నారు. ఇందులో నీనా గుప్తా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల పూర్తి చేయగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈక్రమంలో.. తాజాగా, అనన్య పాండే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది చివరి రోజున డిసెంబర్ 31న రాబోతున్నట్లు వెల్లడించింది. అలాగే కార్తీక్ ఆర్యన్‌తో ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఈ సంవత్సరం మీ చివరి రోజును మాతో గడిపేందుకు సిద్ధంగా ఉండండి. సంవత్సరం ముగుస్తోంది.. మా ప్రేమ మొదలవుతుంది. ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’ 31-12-2025 మీ ముందుకు రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సూపర్ ఎగ్జైటెడ్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story