మా ప్రయాణం ముగిసింది.. అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ శ్రీనిధి శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty).

మా ప్రయాణం ముగిసింది.. అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ శ్రీనిధి శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty). ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. శ్రీనిధి శెట్టి త్వరలో ‘తెలుసు కదా’(TelusuKada). ఇందులో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)హీరోగా నటిస్తుండగా.. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ చిత్రంగా రాబోతుండగా.. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, శ్రీనిధి శెట్టి ‘తెలుసు కదా’ షూటింగ్ అప్డేట్ ఇస్తూ పోస్ట్ పెట్టింది. సిద్దు జొన్నలగడ్డతో పాటు ‘తెలుసు కదా’ మూవీ టీమ్‌తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ షూటింగ్ పూర్తి అయినట్లు వెల్లడించింది. అలాగే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలిపింది. ‘‘నెల రోజుల్లో అత్యంత హృదయపూర్వకమైన కథను మీ ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధంగా ఉంది. మా ప్రయాణం ముగిసింది’’ అని రాసుకొచ్చింది.

Next Story