స్టంట్ మ్యాన్ మరణ వార్త తెలియగానే మా హృదయం బద్దలైంది.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. నిత్యం పలువురు నటీనటులు ప్రాణాలు కోల్పోతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

స్టంట్ మ్యాన్ మరణ వార్త తెలియగానే మా హృదయం బద్దలైంది.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. నిత్యం పలువురు నటీనటులు ప్రాణాలు కోల్పోతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే షూటింగ్ జరుగుతుండగా.. ప్రమాదం జరిగి ప్రముఖ స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో చనిపోయారు. పా. రంజిత్(Pa. Ranjit) డైరెక్షన్‌లో ఆర్య నటిస్తున్న మూవీ సెట్‌లో కారు బోల్తా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. చికిత్స కోసం రాజును చిత్రబృందం సమీపంలోని ఓ ఆస్పత్రికి కూడా తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆయన మరణించారు. ఇక ఈ సంఘటన చిత్రబృందం నిర్లక్ష్యం వల్లే జరిగిందని డైరెక్టర్ పా. రంజిత్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈక్రమంలో.. తాజాగా, పా రంజిత్ ట్విట్టర్ ద్వారా రాజు మృతిపై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

‘‘జూలై 13న ప్రతిభావంతుడైన స్టంట్ మ్యాన్, మాతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సహచరుడు మోహన్‌రాజు(Mohan Raju)ను కోల్పోయాం. ఆయన మరణ వార్త తెలియగానే మా హృదయం బద్దలైంది. రాజు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు అతన్ని ప్రేమించే వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ రోజు పక్కా ప్రణాళికతోనే షూటింగ్‌ను స్టార్ట్ చేశాము. అన్ని విధాలుగా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ సీన్ ఎలా తీయాలో చెప్పాం. అంతా మంచి జరగాలని ప్రతి మూవీ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రార్థిస్తాం. ఈ షూటింగ్ విషయంలోనూ అలాగే చేశాం.

అనుకోని విధంగా రాజు కన్నుమూశారు. ఆ సంఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. మోహన్ అన్న అంటే స్టంట్ టీమ్‌తో పాటు మొత్తం మూవీ టీమ్ అందరికీ ఎంతో గౌరవముంది. అన్ని తెలిసిన వ్యక్తి ఆయన. స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్(Dilip Subbarayan) అన్ని జాగ్రత్తలు తీసుకుని రక్షణ చర్యలు తీసుకుని చేసినప్పటికీ అసమాన ప్రతిభావంతుడైన వ్యక్తిని కోల్పోయాం. అందరూ గర్వపడేలా పనిచేసేవారు. ఆయన ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం పా. రంజిత్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆయన సింపతీ కోసం అలా చేశారని అంటున్నారు.

link

Next Story