- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా గుండె నిండిపోయింది.. కవల పిల్లల పుట్టుకపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్!
మెగా వారసుల రాకతో మెగా కుటుంబంలోకి జనవరి 31న సరికొత్త వెలుగులు వచ్చాయి.

దిశ, సినిమా: మెగా వారసుల రాకతో మెగా కుటుంబంలోకి జనవరి 31న సరికొత్త వెలుగులు వచ్చాయి. రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులకు కవలలు జన్మించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంతోషకరమైన క్షణాలను, డెలివరీ వెనుక జరిగిన పక్కా ప్లానింగ్‌ను వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘బిహైండ్ ది సీన్స్’పేరుతో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో కేవలం వైద్యులే కాకుండా, నర్సులు, జ్యోతిష్యులు ,ఇతర నిపుణులు ఉపాసన డెలివరీ సాఫీగా సాగేందుకు ఎంతలా కష్టపడ్డారో చూపించింది. వీడియోతో పాటు ఉపాసన ఓ ఎమోషనల్ నోట్‌తో అందరి మనసులు గెలుచుకుంది. ‘‘ఈ వీడియో చూసినప్పుడల్లా నా మనసు నిండిపోతోంది. మా కుటుంబానికి అండగా నిలిచిన అపోలో హాస్పిటల్స్ టీమ్‌కు, డాక్టర్ తేజస్వి రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అంకితభావం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది’’ అని పేర్కొంది.
అంతేకాకుండా, రామ్ చరణ్ అభిమానులకు ఒక విన్నపం కూడా చేసింది. ‘‘మీ అందరి ప్రేమ మాకు తెలుసు.. కానీ మా పిల్లల భద్రతను, వారి ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను’’ అని కోరింది. చిరంజీవి గారు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకుంటూ, తన మనవడు, మనవరాలిని చూసి చాలా గర్వంగా ఉందని, తాతగా ఇది తనకు దైవ సమానమైన క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ కూడా తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘మా జీవితాల్లోకి బాబు, పాప రావడం మాకెంతో కృతజ్ఞతగా అనిపిస్తోంది. మా ఇంటి మహిళలే మాకు అతిపెద్ద బలం’’ అంటూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. కాగా. రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ‘పెద్ది’మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30 థియేటర్స్‌లోకి రాబోతుంది.
‘‘మరో చిన్న ప్రాణం రాబోతోంది’’.. రానా భార్య ఎమోషనల్ పోస్ట్






