మా కుటుంబం పెద్దదైంది.. గుడ్ న్యూస్ ప్రకటించిన సోనమ్ కపూర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-30 05:16:41  IST  )

అపారమైన కృతజ్ఞతతో, ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం.

మా కుటుంబం పెద్దదైంది.. గుడ్ న్యూస్ ప్రకటించిన సోనమ్ కపూర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి, అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. సోనమ్ రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మార్చి 29న తమ కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోనమ్-ఆనంద్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంతోషకరమైన విషయాన్ని పంచుకుంటూ సోనమ్ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. "అపారమైన కృతజ్ఞతతో, ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ముఖ్యంగా మా పెద్ద కుమారుడు వాయు, తన తమ్ముడిని స్వాగతించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. నలుగురితో కూడిన ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము" అంటూ సోనమ్, ఆనంద్, వాయు పేరుతో ఈ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. సోనమ్ కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా 2018 మే నెలలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2022లో మొదటి సంతానంగా వాయు జన్మించాడు. ఇప్పుడు రెండో బాబు రాకతో అనిల్ కపూర్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక సోనమ్ సినిమాల విషయానికొస్తే.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'సావరియా' సినిమాతో సోనమ్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తనదైన నటనతో 'రాంఝన', 'ఖబ్సూరత్', 'ప్రేమ రతన్ ధన్ పాయో', 'నీర్జా' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా 'నీర్జా' సినిమాకు గానూ ఆమె జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Samyuktha Menon: లైట్ పింక్ డ్రెస్‌లో క్లాసీ లుక్‌తో కట్టిపడేసిన సంయుక్త

Next Story