- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samyuktha Menon: లైట్ పింక్ డ్రెస్‌లో క్లాసీ లుక్‌తో కట్టిపడేసిన సంయుక్త
క్లాసీ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన సంయుక్త.

దిశ, వెబ్ డెస్క్: నటనతో పాటు అందాలతో ఆకట్టుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో జెట్ స్పీడులో ముందుకు దూసుకెళ్తున్న ముద్దుగుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. ఇప్పటివరకు ఈమె తక్కువ సినిమాల్లోనే నటించినా, వాటిలో ఎక్కువ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది.
దాంతో వరుసగా ఈ హీరోయిన్‌కు తెలుగులో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈమె నటించిన "నారీ నారీ నడుమ మురారి" చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ నటి నిఖిల్ హీరోగా రూపొందుతున్న "స్వయంభు" చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.
అందులో చాలా వరకు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో సంయుక్త లైట్ పింక్ కలర్ గౌన్ ధరించి, హెయిర్‌ను సింపుల్‌గా ఒకచోట ముడిచి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
ఈ ఫోటోలలో ఈమె ఎక్కువగా స్కిన్ షో చేయకుండా డీసెంట్ లుక్‌లో స్టిల్స్ ఇచ్చింది. అందులో సంయుక్త ఎంతో అందంగా కనిపించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






