Oscar 2023 : ఆర్ఆర్ఆర్ కంటే బాహుబలి2 రేంజే ఎక్కువ?మరి ఆస్కార్‌ ఎందుకు రాలేదు?

by Disha Web Desk 10 |
Oscar 2023 : ఆర్ఆర్ఆర్ కంటే బాహుబలి2 రేంజే ఎక్కువ?మరి ఆస్కార్‌ ఎందుకు రాలేదు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్‌ రేసులో నిలబెట్టిన బాహుబలిని ఎందుకు తీసుకెళ్లలేదన్న సందేహాలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లను కలెక్ట్ చేస్తే బాహుబలి 2 రూ. 1800 కోట్లను కలెక్ట్ చేసింది. చాలా మందికి ఆర్ఆర్ఆర్ కంటే బాహుబలి బాగా నచ్చింది.

ఆర్ఆర్ఆర్ కంటే బాహుబలి 2 రూ. 600 కోట్లను ఎక్కువ కలెక్ట్ చేసింది. బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజుకు తీసుకెళ్లాడు. ఒక రకంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళికి మన దేశంలో కంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా ఆస్కార్‌ వరకు వెళ్ళడానికి హాలీవుడ్ మ్యాగజైన్స్ ముఖ్య కారణం. జక్కన్న సీన్స్ విషయంలోనే కాదు. అవార్డుల విషయంలో కూడా రాజి పడడని అర్ధం అయింది. ఆర్ఆర్ఆర్ నుంచి ముందుగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ టీజర్స్ వచ్చిన బాహుబలికి వచ్చినట్టు పేరు అయితే రాలేదనే చెప్పాలి. నాటు నాటు పాట రీలిజ్ అయిన తర్వాత ఒక హైప్ క్రియోట్ అయింది. తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లో ధుమ్ము లేపింది. ఆ తర్వాత ఈ పాట మీద ఎన్నో కవర్ సాంగ్స్ వచ్చి.. ఇది అందరి పాటగా మారిపోయింది. ఈ విధంగా ఆస్కార్‌‌కు నామినేట్ అయి అవార్డును సొంతం చేసుకుంది.

Also Read: ఆస్కార్ వచ్చిందన్న విషయం ముందు తనకే చెప్పా: NTR

Read more:

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం..ఫ్యాన్స్‌తో ఆస్కార్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్న తారక్



Next Story