మార్చి 3న ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ గ్రాండ్ రిలీజ్

by Disha Web Desk 7 |
మార్చి 3న ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ గ్రాండ్ రిలీజ్
X

దిశ, సినిమా : ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ' మార్చి 3న విడుదల కానుంది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, మాటలు కూడా కృష్ణారెడ్డి అందించడం విశేషం. కాగా రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహెల్, మృణాళిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మేకర్స్. ఇక సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి సాహిత్యం అందించారు.



Next Story

Most Viewed