హద్దులు దాటితేనే అవకాశాలు.. అన్ని అనుభవించాలనే నా కోరిక అంటూ యంగ్ బ్యూటీ కామెంట్స్!

by Mallepaka Hamsa |

సీతారామం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).

హద్దులు దాటితేనే అవకాశాలు.. అన్ని అనుభవించాలనే నా కోరిక అంటూ యంగ్ బ్యూటీ  కామెంట్స్!
X

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). అందంతో పాటు, తన నటనతో కోట్ల మంది మనసులు గెలుచుకుంది. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఒక్క మూవీతోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్‌ అని తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటుంది. తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేస్తూ.. ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇక తనకు భాషలతో సంబంధం లేదని సరిహద్దులు దాటి నటించడమే ఇష్టమని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకే ఇండస్ట్రీలో స్థిరపడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒక భాషకు మాత్రమే పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. హద్దులు దాటితేనే అవకాశాలు వస్తాయి. అందుకే..

ఒక నటిగా అన్ని రకాల సంస్కృతులను, భాషలను అనుభవించాలని నా కోరిక. తెలుగు సినిమాల్లో నటించడం వల్ల నాకు ఎంతో గౌరవం దక్కింది. ప్రేక్షకులు నన్ను తమ ఇంటి ఆడిబిడ్డలా ఆదిరస్తున్నారు. హిందీలో కూడా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. భాష అనేది కేవలం భావవ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమే అని నేను నమ్ముతా. మంచి కథ ఉంటే.. ప్రరంచంలో ఎక్కడికైనా ఏ భాషలోనైనా వెళ్లి నటిస్తా’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా.. మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ హిందీలో రెండు ప్రాజెక్ట్స్ చేస్తుండగా.. తెలుగులో ‘డెకాయిట్’ చేస్తుంది. ఇందులో అడివి శేష్(adivi sesh) హీరోగా నటిస్తుండగా.. షానీల్ డియో(Shanil Deo) దర్శకత్వంలో రాబోతుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా.. మార్చి 19న విడుదల కానుంది.

Next Story