‘వార్-2’ నుంచి లవ్ సాంగ్ రిలీజ్.. బికినీలో కనిపించి బిగ్ షాకిచ్చిన కియారా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-15 17:15:21  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్-2’.

‘వార్-2’ నుంచి లవ్ సాంగ్ రిలీజ్.. బికినీలో కనిపించి బిగ్ షాకిచ్చిన కియారా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్-2’. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు-14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

తాజాగా, ‘వార్-2’ సినిమాకు సంబంధించిన ‘ఊపిరి ఊయలగా’ అని సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్‌లో అమితాబ్ భట్టాచార్య రచించిన ఈ పాటను అర్జిత్ సింగ్, నిఖిత పాడగా.. ప్రీతమ్ సంగీతం అందించారు. ఇక ఈ పాటలో కియారా గ్రీన్ బికినీలో కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. అడవిలో స్విమ్మింగ్ పూల్ వద్ద థైయ్స్, నడుము, ఎద అందాలు చూపిస్తూ హృతిక్ రోషన్‌ ముందు రెచ్చిపోయింది. అలాగే స్ప్రే చేసుకుంటూ ఆయనను రెచ్చగొట్టింది. అయితే ఆమె బికినీలో కనిపించింది తక్కువ సమయం అయినప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొట్టమొదటిసారి కియారా బికినీలో కనిపించడంతో నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆమె అందానికి అంతా మంత్రముగ్దులవుతున్నారు.

Click For Link..

Next Story