Samantha: దుఃఖాన్ని మాత్రమే మిగిల్చింది.. జీవితం ఎంత దుర్భలమో అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Samantha: దుఃఖాన్ని మాత్రమే మిగిల్చింది.. జీవితం ఎంత దుర్భలమో అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెఘాని గుజ్‌సెల్ విమానాశ్రయ సమీపంలో ఒక్కసారిగా విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరిగిన ఫ్లైట్‌లో 242మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో ఏకంగా 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, కెనడాకు ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో 240పైగా ప్రయాణికులు ఫ్లైట్ సిబ్బంది మరణించగా.. ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, సమంత(samantha) విమానం ప్రమాదంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయింది. ‘‘గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక యంత్రాలను పంపించారు. ఇలాంటి రోజులు జీవితం ఎంత దుర్భలమో మనకు గుర్తు చేస్తాయి. చాలా ఆశలు, కలలు క్షణంలో మాయమైపోతాయి. దుఃఖాన్ని మాత్రమే మిగిల్చాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వార్తను అర్థం చేసుకోవడం కష్టం. బాధితుల కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధను ఎవరూ ఊహించలేరు. ఈ అమానుషమైన నష్టాన్ని భరించడానికి ఏదో ఒక విధంగా ఈ దుఃఖాన్ని అధిగమించడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి దేవుడు వారికి శక్తిని ప్రసాదించుగాక’’ అని రాసుకొచ్చింది.

Next Story