- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి డైరెక్టర్‌తో ఆ స్టార్ హీరో గొడవ.. ఆగిపోయిన భారీ ప్రాజెక్ట్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) వరుస సినిమాలతో పాటు పలు వివాదాల్లో నిలుస్తుంటారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) వరుస సినిమాలతో పాటు పలు వివాదాల్లో నిలుస్తుంటారు. దర్శకులతో అభిప్రాయ బేధాలు రావడంతో పలు చిత్రాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, విశాల్ చుట్టూ ఓ వివాదం తిరుగుతుంది. మరోసారి ఓ దర్శకుడితో ఆయన గొడవ పడినట్లు సమాచారం. దీంతో భారీ ప్రాజెక్ట్ మధ్యలో షూటింగ్ ఆగిపోయినట్లు టాక్. అసలు విషయంలోకి వెళితే.. డైరెక్టర్ రవి అరుసు, విశాల్ కాంబోలో ‘మకుటం’ (makutam)సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కొంత మేరకు చిత్రీకరణ కూడా పూర్తి అయింది. ఇందులో దుషారా విజయన్(Dushara Vijayan), అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. విశాల్ కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది.
ఇటీవల మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ మూవీలో విశాల్ ట్రిపుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. రవి అరుసు, విశాల్ మధ్య గొడవలు తలెత్తినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ గొడవలకి అసలు కారణం ఏంటో తెలియనప్పటికీ ‘మకుటం’ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడెవరైనా వస్తారా? లేక విశాలే డైరెక్ట్ చేస్తాడా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కాగా.. విశాల్ గొడవ పడటం కొత్తేమి కాదు. ఇది వరకు డైరెక్టర్ మిస్కిన్‌తో గొడవైంది. గతంలో ‘డిటెక్టివ్’ సీక్వెల్ సమయంలో మనస్పర్థలు తలెత్తగా.. మిస్కిన్ తప్పుకున్నాడు సినిమాను మధ్యలోనే ఆపేశారు. దీంతో విశాల్ కొంత మేరకు చిత్రీకరణ కూడా చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీని మొత్తానికే ఆపేశారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి సంఘటనే జరగడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






