‘ప్రాజెక్ట్ కే’ తొలి రోజే రూ.500 కోట్లు రాబడుతుంది: Bharadwaja Thammareddy

by Kodari Anjali |   (  Updated:2023-06-29 06:58:53  IST  )

గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కే’.

‘ప్రాజెక్ట్ కే’ తొలి రోజే రూ.500 కోట్లు రాబడుతుంది: Bharadwaja Thammareddy
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ కూడా ఓ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నాడని తెలిస్తుండగా.. మూవీపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా సినిమాపై స్టార్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ‘ప్రాజెక్ట్ కె’ విడుదలైన తొలి రోజే రూ.500 కోట్లు వసూలు చేస్తుందన్నాడు. ‘నేను నేరుగా సెట్స్‌కు వెళ్లాను. నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్న తీరు చూసి ఈ కామెంట్ చేస్తున్నాను. సినిమాని సరిగ్గా చూపించగలిగితే ప్రపంచ బాక్సాఫీస్ లిస్టులో టాప్‌లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఈ మధ్యే కమల్ హాసన్ కూడా షూటింగ్‌లో చేరాడు. నా నమ్మకం ప్రకారం ఈ మూవీ ప్రపంచ రికార్డులను బ్రేక్ చేస్తుంది’ అని చెప్పారు.

Read More: SS Rajamouli: ద్విపాత్రాభినయంలో అదరగొట్టిన రాజమౌళి!

Next Story