సూపర్‌ స్టార్‌ ‘జైలర్‌’ సినిమా రిలీజ్‌ రోజు ఆ ఉద్యోగులకు సెలవుతో పాటు టికెట్స్ కూడా!

by Disha Web Desk 6 |
సూపర్‌ స్టార్‌ ‘జైలర్‌’ సినిమా రిలీజ్‌ రోజు ఆ ఉద్యోగులకు సెలవుతో పాటు టికెట్స్ కూడా!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్‌ స్టార్‌ అనే పేరు తెరపై కనిపిస్తే చాలు ఈలలు గోలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోవాల్సిందే. ఇక రజినీ స్క్రీన్‌ మీద కనబడితే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే రజినీకాంత్, తమన్నా కలిసి నటించిన ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా ‘యూనో ఆక్వా కేర్’ అనే కంపెనీ ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. అంతేకాకుండా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉచితంగా మూవీ టిక్కెట్‌లు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన సర్క్యూలర్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అది చూసిని నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed