‘ఓం శాంతి శాంతి శాంతి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba), తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) జంటగా నటిస్తున్న సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి’(Om Shanti Shanti Shanti).

‘ఓం శాంతి శాంతి శాంతి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba), తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) జంటగా నటిస్తున్న సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి’(Om Shanti Shanti Shanti).ఇది మలయాళ హిట్ చిత్రం ‘జయా జయా జయా జయా హేకి’ రీమేక్‌గా రాబోతుంది. ఇందులో వైవాహిక జీవితంలో సమస్యలు, లింగ సమానత్వం వంటి అంశాలను హాస్యం, డ్రామాతో చూపిస్తారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈషా రెబ్బా పాత్ర బలమైన, స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా ఉండబోతుందని టాక్. తరుణ్ భాస్కర్ తన ప్రత్యేకమైన టైమింగ్, నేచురల్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా, ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ సిన్నారి కోనా డిసెంబర్ 30న రాబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఈషా రెబ్బా గోడపైకి ఎక్కి జీడి కాయలు కోస్తుండగా.. ఫ్యామిలీ మొత్తం ఆమెను ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story