నేను పవన్ కళ్యాణ్‌ను పిచ్చిగా ప్రేమించా..! యాంకర్ సుమ ఆ విషయం ఇన్నాళ్లు ఎందుకు గోప్యంగా ఉంచిందంటే?

by Disha Web Desk 9 |
నేను పవన్ కళ్యాణ్‌ను పిచ్చిగా ప్రేమించా..! యాంకర్ సుమ ఆ విషయం ఇన్నాళ్లు ఎందుకు గోప్యంగా ఉంచిందంటే?
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన నటుడు శ్రీవిష్ణు.. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీస్, ఫన్నీ రాబరీ స్టోరీస్, అలాగే ఎమోషనల్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. గత ఏడాది ‘సామజవరగమన’ చిత్రంతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి కొద్ది గంటల్లో ఈ హీరో ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 22 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుందో లేదో రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.

ఇందులో ప్రియదర్శి, రాహూల్ రామకృష్ణ, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కథ మొత్తం వీరి ముగ్గురి చూట్టే తిరుగుతుందట. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా వీరు సుమ అడ్డా షో కు హాజరై తెగ సందడి చేశారు. లేటెస్ట్ ప్రోమోలో చూసినట్లైతే... అందరిపై సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్వించే స్టార్ యాంకర్ సుమపై.. ప్రియదర్శి, శ్రీవిష్ణు, రాహూల్ చుక్కలు చూపించారు.

అక్కడున్నవారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. యాంకర్ పై వరుస పంచ్ లు వేస్తూ చెలరేగిపోయారు. తర్వాత మీ తొలిప్రేమ గురించి చెప్పండని అడిగింది. దీనికి హీరో శ్రీవిష్ణు బదులిస్తూ.. ఆ చిత్రాన్ని నేను అమలాపురం వెంకటరామ థియేటర్ లో చూశాను అంటాడు. దీంతో షో లో మరోసారి నవ్వులు పూయిస్తాయి. దీంతో సుమ నేను అడిగింది మీ ఫస్ట్ లవ్ గురించండి అంటుంది.

ఎస్ నేను ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నే పిచ్చిగా లవ్ చేశా అంటాడు. అనంతరం సుమ కుమారి ఆంటీ లా మిమిక్రీ చేస్తూ.. వారందరికీ భోజనం వడ్డిస్తుంది. చివరకు ప్రియదర్శి, శ్రీవిష్ణు, రాహూల్ సర్‌ప్రైస్ ఇస్తారు. యాంకర్ సుమ తన ట్రస్ట్ ద్వారా ఆశ్రమం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా అందులోని వృద్ధులను వీరు షో కు తీసుకువస్తారు. వారందరి సమక్షంలో సుమ పుట్టిన రోజు వేడుకలు జరుపుతారు. దీంతో సుమ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. ఈ వార్త పలువురు జనాలు సుమ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప మనసని.. సుమ ఏ పని చేసిన గోప్యంగా ఉంచుతుందని.. కానీ మంచే చేస్తుందంటూ కొనియాడుతున్నారు.

Read More..

టూ మచ్ బోల్డ్‌గా దర్శనమిచ్చిన దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్..!


Next Story

Most Viewed