- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టూ మచ్ బోల్డ్‌గా దర్శనమిచ్చిన దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్..!
2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవుళ్లు’ చిత్రం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

దిశ, సినిమా: 2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవుళ్లు’ చిత్రం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీలో రమ్యకృష్ణ, సుమన్, శ్రీకాంత్, లయ, ఎస్పీ బాలు, రాజేంద్రప్రసాద్.. ఇలా మహానుభావులంతా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా మొత్తం ఇద్దరు పిల్లల చూట్టూ తిరుగుతుంటుంది. అమ్మానాన్నల్ని ఒక్కటి చేయడం కోసం ఇద్దరు చిన్నారులు పడిన కష్టం చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమాలో నటించిన చిన్నారుల్లో బేబీ నిత్య ఒకరు. ఈ అమ్మడు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఎంతో అమాయకంగా.. ఎమోషనల్ గా కట్టిపడేసిన ఈ బుడ్డ దాన్ని ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు. బీచ్ లో పడుకుని.. విరహ వేదనలో తేలుతున్నట్లుగా వీపు చూపిస్తూ ఓ స్టన్నింగ్ వీడియోను పంచుకుంది. అంతేకాకుండా మరిన్ని హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వదిలి.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. అసలు దేవుళ్లు సినిమా హీరోయినేనా? అంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
సినిమాల విషయానికొస్తే...
నటి బేబీ నిత్య దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాక.. హీరోయిన్ గా కొన్ని మూవీల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ‘నువ్వు తోప్ రా, పిట్టా కథ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.






