- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత పగ కొత్త యుద్ధం.. అంచనాలను పెంచుతున్న ‘ధురంధర్ రివేంజ్’ టీజర్
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh), సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ కలిసి చేసిన మ్యాజిక్ ‘ధురంధర్’.

దిశ, సినిమా: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్(Ranveer Singh), సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ కలిసి చేసిన మ్యాజిక్ ‘ధురంధర్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా రణవీర్ స్టైల్, అక్షయ్ ఖన్నా విలనిజం మధ్య సాగే సీన్లు ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఇక ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్ రివెంజ్’(Dhurandhar Revenge) రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుండే కథ మొదలైనట్లు కనిపిస్తోంది. రణవీర్ సింగ్ తన పాత పగను తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్లాడు.. యుద్ధం ఎలా చేశాడు అనేదే ఈ ‘రివెంజ్’ కథ.
విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఆదిత్య ధార్ మేకింగ్ స్టైల్ మరోసారి అబ్బురపరుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. పార్ట్ 1 లో అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు సీక్వెల్‌లో వీరిద్దరి మధ్య సాగే సీన్లు మరింత క్రేజీగా ఉండబోతున్నట్లు టీజర్ హింట్ ఇస్తోంది. రణవీర్ మాస్ లుక్, అక్షయ్ ఖన్నా కోల్డ్ విలనిజం మధ్య వార్ ఈసారి నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. చివర్లో.. ఇది నూతన భారతదేశం.. సరిహద్దులు దాటి ఇంట్లోకి చొచ్చుకొచ్చి.. చంపుతుంది కూడా’’ అని రణవీర్ చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. కాగా.. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఉగాది కానుకగా.. మార్చి 19న విడుదల కాబోతుంది. అదే రోజున కన్నడ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ కూడా విడుదల తేదీని ప్రకటించింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్స్‌తో వస్తున్న ఈ సినిమాతో రణవీర్ సింగ్ పోటీ పడాల్సి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజున పోటీపడితే వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ క్రేజీ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలంటే మార్చి 19 వరకు వేచి చూడాల్సిందే.






