ఆకట్టుకుంటున్న శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' ట్రైలర్

by Disha Web Desk 6 |
ఆకట్టుకుంటున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం ట్రైలర్
X

దిశ, సినిమా: గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా, సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు కుర్ర హీరో శర్వానంద్. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో 'ఒకే ఒక జీవితం' మూవీతో సిద్ధంగా ఉన్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీ కార్తీక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. అమల, రీతూ వర్మ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రం టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తుండగా.. శర్వా మ్యూజిషియన్‌గా కనిపించాడు. ఇక సైంటిస్ట్‌గా కనిపించిన నాజర్.. చనిపోయిన శర్వా తల్లిని మళ్లీ కలిపేందుకు ప్రయత్నించగా ఏం జరిగిందనేది సస్పెన్స్.

Also Read : స్టార్ కిడ్స్ మొత్తం డ్రగ్స్ బానిసలే.. నడిరోడ్డుపై దొరికిన ఖుషీ, నీసా


Next Story

Most Viewed