- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG సక్సెస్.. సిగ్గుండాలి అంటూ హీరోయిన్ ట్వీట్.. మరీ ఇంత డైరెక్ట్‌గానా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరిగిపోయాయి. దీంతో చాలా మంది ప్రముఖులు హీరో అండ్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్స్ వేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరిగిపోయాయి. దీంతో చాలా మంది ప్రముఖులు హీరో అండ్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇన్నాళ్లు బూతులు తిట్టిన ఓ ఛానల్ హెడ్.. ఇప్పుడు ఓజీ సక్సెస్ గురించి ట్వీట్ చేయడం.. పవన్‌కు శుభాకాంక్షలు చెప్పడం.. బాక్సాఫీస్ నంబర్స్ గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అప్పటికే ఫ్యాన్స్ ఈ ట్వీట్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు.
ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ‘షేమ్ ఆన్ యూ ’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. దీంతో చర్చ మరింత పీక్స్‌కు వెళ్లింది. ఆమె వేసిన ట్వీట్‌లో ఎవరు ఎంత, ఎలా అర్థం చేసుకుంటే.. అంత అర్థం చేసుకోవచ్చని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ సిగ్గులేనిది ఎవరికి అంటూ ముచ్చటించుకుంటున్నారు. ఇంకొందరు అయితే మరీ ఇంత డైరెక్ట్‌గానా అంటూ ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు.






