భారీ ట్విస్ట్ ఇచ్చిన ‘ఓజీ’ మూవీ మేకర్స్.. వివాదాస్పద నటుడి పోస్టర్‌ రిలీజ్ చేయడంతో అంతా షాక్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-19 03:02:07  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ‘ఓజీ’(OG).

భారీ ట్విస్ట్ ఇచ్చిన ‘ఓజీ’ మూవీ మేకర్స్.. వివాదాస్పద నటుడి పోస్టర్‌ రిలీజ్ చేయడంతో అంతా షాక్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ‘ఓజీ’(OG). పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రాబోతున్న ఈ చిత్రానికి సుజిత్(Sujith) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, షాన్ కక్కర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న థియేటర్స్ విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ నిత్యం పలు అప్డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచుతున్నారు.

తాజాగా, చిత్రబృందం ఓ నటుడి పోస్టర్ రిలీజ్ చేసి అందరికీ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ‘ఓజీ’ సినిమాలో వివాదాస్పద యాక్టర్ ప్రకాష్ రాజ్ సత్యదాదా పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక విడుదలైన పోస్టర్‌లో ఆయన శాలువా కప్పుకుని కళ్లజోడు పెట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించారు. ఇక ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడా లేక పాజిటివ్ క్యారెక్టర్‌లోనా అనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది కాలంగా ప్రకాష్ రాజ్ పవర్ స్టార్‌పై పలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ‘ఓజీ’లో ఆయనకు చాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Next Story