ఓటీటీలోకి రాబోతున్న ‘తలైవా.. తలైవి’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఇటీవల ‘ACE’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

ఓటీటీలోకి రాబోతున్న ‘తలైవా.. తలైవి’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఇటీవల ‘ACE’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత విజయ్ సేతుపతి, నిత్యా మీనన్(Nithya Menon) కాంబోలో వచ్చిన చిత్రం ‘తలైవా తలైవి’(Thalaiva Thalaivi). ఈ మూవీ ‘సార్.. మేడమ్’ పేరుతో వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. యోగిబాబు, రోషిని హరి ప్రియన్, మైనా నందిని, దీప శంకర్, కాళీ వెంకట్, వినోద్ జోస్, శరవణన్ కీలక పాత్రలో నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా జులై 25న తమిళ భాషలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఆగస్టు 1న రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘తలైవా.. తలైవి’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. ఆగస్టు 22నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా ‘‘తెలుగు, తమిళ, హిందీ, కన్నడ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆకాశవీరయ్య, రాణిలతో ప్రేమలో పడేందుకు రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story