నా ఫస్ట్ క్రష్ ఆమె భర్తనే.. పిచ్చి పిచ్చిగా నచ్చాడు

by Dishanational2 |
నా ఫస్ట్ క్రష్ ఆమె భర్తనే.. పిచ్చి పిచ్చిగా నచ్చాడు
X

దిశ, సినిమా : నటి నుష్రత్ భరుచా తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసింది. అయితే నిజానికి క్రష్ అనేది తన దృష్టిలో చాలా చిన్న పదమని చెప్పిన నటి.. రణ్‌బీర్ పట్ల తనకు చెప్పలేనంత గుడ్డి ప్రేమ ఉందని తెలిపింది. ‘నేను ‘తూ ఝూఠీ మై మక్కార్’లో ఒక చిన్న పాత్ర చేశాను. అది నా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచిపోయింది. అయితే షూటింగ్ టైమ్‌లో రణ్‌బీర్ టాలెంట్ చూసి ఫిదా అయ్యాను. అతన్ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతున్నానని డైరెక్టర్ లవ్ రంజన్‌తోపాటు టీమ్ మొత్తానికి చెప్పాను. కానీ, అతని గురించి నేను ఇలా ఆలోచిస్తున్నట్లు రణబీర్‌కి మాత్రం చెప్పవద్దని కోరాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది నుష్రత్.

ఇవి కూడా చదవండి:

చిరంజీవితో ఒక్కసారైనా రొమాన్స్ చేయాలని నా కోరిక : ప్రియమణి


Next Story