- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీ రోజుల్లోనే దారుణంగా మోసపోయా.. ఏ మగాడిని నమ్మాలనిపించట్లేదు
సినిమాల్లోకి రాకముందే సింగర్‌గా అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన యంగ్ బ్యూటీ నుపూర్ సనన్.. కాలేజీ రోజుల్లోనే ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయానంటోంది.

దిశ, సినిమా: సినిమాల్లోకి రాకముందే సింగర్‌గా అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన యంగ్ బ్యూటీ నుపూర్ సనన్.. కాలేజీ రోజుల్లోనే ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయానంటోంది. ‘టైగర్ నాగేశ్వరరావు’తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది. ‘ప్రేమను వర్ణించడానికి మాటలు సరిపోవు. కొందరు భారీ డైలాగులు చెబుతుంటారు. నా దృష్టిలో నిర్వచనమంటూ ఉంటే కదా ప్రేమ గురించి చెప్పడానికి. నా కాలేజీ రోజుల్లో ప్రేమ పేరుతో ఒకడు చీటింగ్ చేశాడు.
అతనికి సరైన బుద్ధి చెప్పాను. అప్పటినుంచి లవ్ అంటే నాకు నమ్మకం పోయింది. ఇప్పటికీ చాలా అందంగా ఉన్నావంటూ చాలామంది పొగుడుతుంటారు. అలా అనిపించుకోవడం గర్వంగా ఉన్నప్పటికీ బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యం ఇస్తూ చేసే కామెంట్లు మనసును తాకవు. ఏదో పొగిడారు కాబట్టి ఆ క్షణం నవ్వుతూ స్పందిస్తా’ అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
- Tags
- Nupur Sanon






