JR NTR సహాయం కోరిన మెగా హీరో..!

by Hajipasha |   ( Updated:2022-12-01 15:19:18.0  )
JR NTR సహాయం కోరిన మెగా హీరో..!
X

దిశ, సినిమా: చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. అయితే బైక్ యాక్సిడెంట్ తర్వాత ఇప్పటివరకు ఏ షూటింగ్‌లో పాల్గొనలేదు. అయితే తాజాగా BVSN ప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ దండు అనే దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటించారు. సుకుమార్ కథను అందించిన ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మూవీ షూటింగ్ ఈ నెల నుండి ప్రారంభం కాబోతుందట. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఈ సినిమాకి సంబందించిన ఒక ఫస్ట్ లుక్‌ను విడుదల చెయబోతున్నారట. అలాగే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే మెగా అభిమానులు మాత్రం ధరమ్ తేజ్‌‌ను తిట్టిపోస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉన్నా.. ఎన్‌టీఆర్‌తో ఎందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

READ MORE

డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు: ఎన్‌ఆర్‌ఐ వెంకట్

Advertisement

Next Story