ఫ్యాన్స్ ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నా.. తారక్ ట్వీట్ వైరల్

by Disha Web Desk 23 |
ఫ్యాన్స్ ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నా.. తారక్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు ఎన్టీఆర్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ నోట్ షేర్ చేసిన తారక్.. ‘ఇప్పటివరకూ నేను చేసిన ప్రతి సినిమా, క్యారెక్టర్స్ అన్నీ ఫ్యాన్స్ కోసమే. నన్ను, నా చిత్రాలను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను. ‘దేవర’ ఫస్ట్ లుక్‌కు వచ్చిన భారీ రెస్పాన్స్‌కు థాంక్స్. మీరంతా కలసి నా బర్త్ డే‌ను మరింత అందంగా, ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందుకుగానూ నా స్నేహితులు, ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు, నటీనటులు, అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more:

Jr.NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ బాధను ఎవరు తీర్చలేరట?



Next Story