- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel షూటింగ్‌కు బ్రేక్.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.. పోస్ట్ వైరల్
సినిమా ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కేవలం ప్రిపరేషన్ కోసం చిన్న విరామం తీసుకున్నాం అంతే.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై గత కొద్దిరోజులుగా నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేరని, అందుకే షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారనే వార్తలు అభిమానులను కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పుకార్లు షికార్ చేస్తుండగా.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగి అసలు నిజాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మైత్రీ మూవీ మేకర్స్ తీవ్రంగా ఖండించింది. "హీరో లుక్ విషయంలో గానీ, షెడ్యూల్ రద్దు విషయంలో గానీ వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదు. సినిమా ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కేవలం ప్రిపరేషన్ కోసం చిన్న విరామం తీసుకున్నాం అంతే. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వ్యాప్తి చేయవద్దని మేము అందరినీ కోరుతున్నాము. అధికారిక అప్‌డేట్‌లు ఎల్లప్పుడూ మా నుండే వస్తాయి.
దయచేసి ఎవరూ ఈ ప్రాజెక్ట్‌పై రూమర్స్ సృష్టించొద్దు" అని ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ క్లారిటీతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 'దేవర'తో మాస్ జాతర మొదలుపెట్టిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రశాంత్ నీల్ శైలిలో ఉండే డార్క్ థీమ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రంలో నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని సమాచారం.






