- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
NTR: ఇచ్చట ప్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇవ్వబడును.. ఎవరొచ్చినా ఓకే అంటూ కామెంట్స్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్నా కలెక్క్షన్స్ లో మాత్రం దూసుకెళ్తుంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ ను దాటేసి రూ. 500 కోట్ల కొట్టడానికి రెడీగా ఉంది. కొరటాల శివ ఆచార్య తో ఫ్లాప్ అందుకున్న ఈ మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు. అయితే, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సంబందించిన ఓ వార్త వైరల్ అవుతుంది.
ఫ్లాప్ లతో ఉన్న పూరి జగన్నాధ్ ఎన్టీఆర్ టెంపర్ మూవీతో హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ సుకుమార్ కూడా అంతే కష్ట కాలంలో ఉన్నప్పుడు నాన్నకు ప్రేమతో మంచి హిట్ కొట్టాడు. రవితేజ తో ఫ్లాప్ అందుకున్న బాబీ ఎన్టీఆర్ జై లవ కుశ బ్లాక్ బస్టర్ కొట్టాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అరవింద సామెత మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆచార్యతో ఫ్లాప్ అయినా కొరటాల శివ దేవర సినిమాతో పెద్ద హిట్ ను అందుకున్నాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చి ఇలా కూడా కొత్త రికార్డును ఎన్టీఆర్ క్రియోట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయినా.. ఇచ్చట ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇవ్వబడును.. ఎవరొచ్చినా ఒకే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.