- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ బుక్‌తో దర్శనమిచ్చిన ఎన్టీఆర్.. హాట్ టాపిక్‌గా మారిన పిక్స్.. ఆ మూవీ గురించి బిగ్ హింట్ ఇచ్చేశాడుగా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’ చిత్రంతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’ చిత్రంతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని టి సిరీస్ ఫిలమ్స్ సమర్పణలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, మైత్రీ మైవీ మేకర్స్, ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘వార్-2’లోనూ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
అయితే అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉండగా.. ఆయన ‘మురుగన్’(Murugan) సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్‌తో చేయాలని డిసైడ్ అయినట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. దీనిని హారికా హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయి ఎయిర్‌పోర్టులోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కెమెరాకు చిక్కారు. అయితే ఆ సమయంలో ఆయన చేతిలో ఆనంద బాలసుబ్రమణ్యం రాసిన ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విస్డమ్’ అనే బుక్ కనిపించింది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ బిగ్ హింట్ ఇచ్చాడు..త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ బుక్ ఆధారంగానే ఈ మూవీ రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు.






