Oscar Awards-2024: వేదికపై మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ హవా (వీడియో).. ఆనందంలో ఫ్యాన్స్

by Disha Web Desk 6 |
Oscar Awards-2024: వేదికపై మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ హవా (వీడియో).. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డ్స్‌ల్లో ఆర్ఆర్ఆర్ సత్తా చాటిన విషయం తెలిసిందే. మొదటి ఇండియన్ సినిమాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇందులోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడంతో చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు 2024 ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకలు ఈరోజు మార్చి 11న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో ఎంతో అట్టహాసంగా జరగుతుంది.

డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ అవార్డు వేడుక లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో మరోసారి ఆర్ఆర్ఆర్ మెరిసింది. నాటు నాటు పాటను స్టేజి వెనుక తెరపై చూపించారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలోని రెండు యాక్షన్ షాట్స్‌ను కూడా చూపించడం అందరినీ ఆనందానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ మూవీ అంటే అలా గుర్తిండిపోతుందంటూ కామెంట్స్ చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు.



Next Story

Most Viewed