Koratala Shiva :: ‘Devara’లో ఆ వీరుడి పోరాటం చూస్తే గూస్ బంప్సే.. కొరటాల అసలే తగ్గట్లేదట!

by Dishanational2 |
Koratala Shiva :: ‘Devara’లో ఆ వీరుడి పోరాటం చూస్తే గూస్ బంప్సే.. కొరటాల అసలే తగ్గట్లేదట!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ చర్చనీయాంశమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే చిత్రాన్ని రూపొందిస్తు్న్న కొరటాల శివ ఎన్టీఆర్‌-సైఫ్‌అలీఖాన్‌ మధ్య యాక్షన్‌ ఎపిసోడ్‌‌ను వీక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సముద్రం నేపథ్యంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కథకు ఆయువుపట్టులా ఉండబోతుందని, విజువల్‌గా కూడా ఆ సన్నీవేశాలను అద్భుతంగా డిజైన్‌ చేస్తున్నారని సమాచారం. ఇక విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం, అక్కడి ప్రజలను రక్షించుకోవడానికి ఓ వీరుడు చేసే పోరాటం నేపథ్యంలో వస్తున్న మూవీ 2024 ఏప్రిల్‌ 5న విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి :: ‘దేవర’లో ఆ వీరుడి పోరాటం చూస్తే గూస్ బంప్సే.. కొరటాల అసలే తగ్గట్లేదట!



Next Story