గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌‌డే పార్టికీ ఎన్టీఆర్ అందుకే రాలేదా?

by Disha Web Desk 6 |
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌‌డే పార్టికీ ఎన్టీఆర్ అందుకే రాలేదా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టిన రోజు అని తెలిసిందే. అయితే నిన్న రాత్రి రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తాజా, సమాచారం ప్రకారం చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎంతో సన్నిహితులు హాజరు కాకపోవడం గమనార్హం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించి ఆస్కార్ అవార్డులు పొందిన ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు రాలేదని సమాచారం. దానికి కారణం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నైట్ టైమ్ ఉండటం వల్ల రాలేదట. అలాగే రామ్ చరణ్ బామర్ధి అల్లు అర్జున్‌కు చిరంజీవికి మధ్య గొడవలు అయ్యాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకే అల్లు అర్జున్ పార్టీకి రాలేదని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ ఎందుకు హాజరు కాలేదనే దానిపై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Sai Pallavi: ముంబైలో మెరిసిన సాయిపల్లవి.. ఆ వీడియో చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story