ఘనంగా ప్రారంభమైన ‘#NTR 30’.. ఇదొక ఎమోషనల్‌ రైడ్‌ అంటున్న కొరటాల

by Disha Web Desk 7 |
ఘనంగా ప్రారంభమైన ‘#NTR 30’.. ఇదొక ఎమోషనల్‌ రైడ్‌ అంటున్న కొరటాల
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘#NTR 30’. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్పణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ, సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మిస్తున్న మూవీ.. గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర లాంచింగ్‌ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రాజ‌మౌళి.. ఎన్టీఆర్‌, జాన్వీలపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రశాంత్ నీల్ గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ మేరకు మాట్లాడిన దర్శకుడు.. ‘ఎన్టీఆర్‌‌తో సెకండ్‌ సినిమా. ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఇదొక ఎమోషనల్‌ రైడ్‌. మాకు బిగ్‌ మూవీ అవుతుంది. సెట్స్‌లో ఫన్‌ ఉంటుందని ఆశిస్తున్నా’ అన్నాడు. దిల్ రాజు, శిరీష్‌, బి.వి.ఎస్‌.ఎన్.ప్రసాద్, ఏషియ‌న్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగ‌ర్వాల్‌, భ‌ర‌త్ చౌద‌రి, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.

Also Read...

‘సెల్ఫిష్’ నుంచి కొత్త పోస్టర్‌.. అట్రాక్ట్ చేస్తున్న హీరో నయా లుక్



Next Story

Most Viewed