- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు: ఎన్‌ఆర్‌ఐ వెంకట్
ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి నటుడిగా రాణించాలనుకుంటున్నట్లు తెలిపాడు.

దిశ, సినిమా: ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ బిజినెస్ మ్యాన్ వెంకట్ దుగ్గిరెడ్డి నటుడిగా రాణించాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల విడుదలైన 'గాలోడు' చిత్రంలో లాయర్‌గా కనిపించిన ఆయన సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన మధుర క్షణాల గురించి మాటల్లో చెప్పలేనన్నాడు. అలాగే ఈ మూవీతో తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, ఊరివాళ్లంతా అందిస్తున్న ప్రేమాభిమానాలు ఉక్కిరిబిక్కిరి చేశాయని హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఇక పాతికేళ్ల క్రితం నెల్లూరు నుంచి అమెరికా వెళ్లిన తనకు నటన ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన లేదని, చిన్నప్పటి నుంచి నటనంటే చెప్పలేనంత ఇష్టమని తెలిపాడు. 'ఈ చిత్రంలో నాకు లాయర్ పాత్ర ఇచ్చి నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేయించిన దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్లకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో హీరోయిన్ ఫాదర్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసిన నా బెస్ట్ ఫ్రెండ్ రవి రెడ్డికి శుభాకాంక్షలు. పలు రకాల పాత్రల ద్వారా సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నా' అంటూ తన కోరికను బయట పెట్టాడు.
READ MORE






