ఆమెలా కావాలంటే.. ఓవర్ ఎక్స్‌పోజ్ మానుకోవాలన్నారు: నోరా

by Disha Web Desk 6 |
ఆమెలా కావాలంటే.. ఓవర్ ఎక్స్‌పోజ్ మానుకోవాలన్నారు: నోరా
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన యాటిట్యూడ్ చూసి మరో కత్రినా కైఫ్‌ కావాలనుకుంటున్నావా? అని చాలామంది ప్రశ్నించినట్లు తెలిపింది నోరా ఫతేహి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినీ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘నా స్టైల్, హావభావాలు చూసి కత్రినలాంటి మరో స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్నావా? అని అడిగారు. మరికొందరు ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్ అవుతానని కలలు కంటున్నావా? అని అదో రకంగా సందేహాలు వ్యక్త పరిచేవారు. కానీ, నా పద్ధతులు నచ్చిన వారు మాత్రం.. ‘మీరు లీడ్‌గా సినిమాలు చేయాలి. మిమ్మల్ని మీరు ఓవర్ ఎక్స్‌పోజ్ చేయకండి. నిజంగా మీ టాలెంట్‌కు సరిపోయే సినిమా కావాలి. అప్పుడు మీరు స్టార్ నటి అవుతారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే నీ దగ్గర కష్టపడే తత్వం ఉంది. తప్పకుండా పైకొస్తావ్’ అని సపోర్టుగా నిలిచినట్లు చెప్పుకొచ్చింది.

Read More: పెళ్లి కాకముందే తల్లి కావాలనుకుంటున్న స్టార్ హీరోయిన్

వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్

Next Story