బాలీవుడ్ నిర్మాతలకు కొత్తవాళ్లు నచ్చరు.. ఎప్పుడూ ఆ మొఖాలే కావాలి: నటి ఫైర్

by Disha Web Desk |
బాలీవుడ్ నిర్మాతలకు కొత్తవాళ్లు నచ్చరు.. ఎప్పుడూ ఆ మొఖాలే కావాలి: నటి ఫైర్
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి బాలీవుడ్ నిర్మాతల తీరుపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తనకు మెయిన్ క్యారెక్టర్స్ ఎందుకు రావడం లేదనే విషయంపై కూడా మాట్లాడింది. ‘బీ టౌన్ ప్రొడ్యూసర్స్‌లో పక్షపాతధోరణి ఎక్కువగా ఉంటుంది. నేను ప్రధాన పాత్రలు చేయకపోవడానికి కారణం నా డ్యాన్స్ కాదు. కొందరు నిర్మాతలు తెలిసిన ముఖాలకే అవకాశాలివ్వడానికి కట్టుబడి ఉంటారు. కొత్త ప్రతిభను అసలే ప్రోత్సహించరు. పరిశ్రమలో కొంతమంది నటీమణులు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. చిత్రనిర్మాతలు వారిని మించి మరొకరిని చూసేందుకు ఇష్టపడరు. అంతకుమించి ఆలోచించరు’ అని వాపోయింది.

అలాగే బాలీవుడ్‌లో స్టార్ నటీమణులు అందంగా డ్యాన్స్ చేయడం, నటించడం అది ప్యాకేజీలో ఒక భాగం మాత్రమేనని, నిజజీవితంలోనూ ఐకానిక్ ఉండాలని ఎవరూ అనుకోవట్లేదని చెప్పింది. ‘నటనా నైపుణ్యాలు, ఉనికి, ప్రకాశం, భాషా నైపుణ్యాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది గుర్తించినపుడే అందరూ సమానంగా అవకాశాలు పొందుతారు. అవకాశం ఇచ్చి ఆ తర్వాత ప్రతిభ గురించి మాట్లాడండి. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం’ అని చెప్పుకొచ్చింది.

Next Story